విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల దక్షిణ భారత

Jan 29, 2026 - 00:32
 0  12
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల దక్షిణ భారత

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల దక్షిణ భారత సదస్సు

గుంతకల్లు, జనవరి 28, (వెలుగు నాడు ప్రతినిధి ) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో కేరళ రాష్ట్రంలోని కన్నూర్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభివృద్ధి పథకాలపై రెండు రోజుల దక్షిణ భారత దేశ స్థాయి సదస్సు నిర్వహించబడింది.ఈ సదస్సులో ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. లక్ష్మయ్య మరియు కళాశాల సమన్వయకర్త రవి శంకర్ శర్మ పాల్గొన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.సదస్సును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్మ్ స్ట్రాంగ్ పామే ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ....కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలను విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నోడల్ అధికారి ప్రొఫెసర్ విజయకుమార్ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలపై చిత్రపట ప్రదర్శన ద్వారా వివరించారు. దీనిపై సంయుక్త కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన కార్యక్రమాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేయాలని సూచించారు.ఈ రెండు రోజుల సదస్సులో మన రాష్ట్రం నుంచి వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రాష్ట్ర నోడల్ అధికారి ప్రొఫెసర్ విజయకుమార్, ఉన్నత విద్యా పథకాల ఉపనిర్దేశకురాలు డాక్టర్ తులసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్