హనుమాన్ జంక్షన్‌లో ఘనంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలు

Jun 2, 2026 - 21:47
 0  2
హనుమాన్ జంక్షన్‌లో ఘనంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలు

హనుమాన్ జంక్షన్‌లో ఘనంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలు

బాపులపాడు జూన్ 02 , (వెలుగు నాడు ప్రతినిధి) : హనుమాన్ జంక్షన్‌లోని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ భవనంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP), కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం టైగర్ పవర్ క్లబ్ సౌజన్యంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీ లక్ష్మీ, ఐసీఎం సంఘాల అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జాన్ ఎస్.డి. రాజు, స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వీరమాచినేని సత్యప్రసాద్, రిటైర్డ్ పీడీ రాఘవేంద్ర మాస్టర్, లయన్స్ క్లబ్ కార్యదర్శి మాకినేని శ్రీనివాసరావు, భారత్ వొడకాయ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గంటా నూకరాజు, కమ్మిలి సూర్యనారాయణ మూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టైగర్ పవర్ క్లబ్ విద్యార్థులు కత్తి సాము, కర్ర సాము, నాన్‌చాక్, కటాస్ తదితర ఆత్మరక్షణ విద్యల ప్రదర్శనలతో ఆకట్టుకొని అతిథుల ప్రశంసలు అందుకున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు.కార్యక్రమం విజయవంతానికి సహకరించిన లయన్స్ క్లబ్ డైరెక్టర్ పంచకర్ల చక్రవర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు ఆది విష్ణు భవాని, బొడ్డుచర్ల రామాంజనేయులు, అలవల వెంకటలక్ష్మిల సేవలను నిర్వాహకులు అభినందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని కోచ్ కట్టా సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్