కటకటాల్లోకి ఎస్సై నాగరాజు తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్

May 18, 2026 - 12:13
 0  25
కటకటాల్లోకి ఎస్సై నాగరాజు తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్

కటకటాల్లోకి ఎస్సై నాగరాజు తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్ ఆపరేషన్

తాడేపల్లిగూడెం మే 17, వెలుగు నాడు ప్రతినిధి) : పశ్చిమగోదావరి జిల్లా,తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పేరూరి నాగరాజు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమజంట వివాదం పేరుతో మొదలైన వ్యవహారం చివరకు లంచం డీల్‌గా మారి ఏసీబీ వలలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది.ప్రేమ వ్యవహారం నుంచి లంచం డీల్ వరకు.ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మేజర్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో వారు ఏలూరుకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో “రేప్ కేసు పెడతాం. రౌడీషీట్ ఓపెన్ చేస్తాం” అంటూ ఎస్సై నాగరాజు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నుంచి బయటపడాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. మధ్యవర్తుల చర్చల తర్వాత రూ.70 వేల వద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.షెడ్‌లో డబ్బుల డీల్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ షెడ్ వద్ద కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం ద్వారా రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్