మున్సిపాలిటీలో వన్ మ్యాన్ షో మూడు పోస్టులు ఒక్క అధికారే
మున్సిపాలిటీలో వన్ మ్యాన్ షో మూడు పోస్టులు ఒక్క అధికారే
మున్సిపాలిటీలో మూడు కుర్చీలు.. కూర్చునేది ఒక్కరే
జగ్గయ్యపేట జూన్ 03 (వెలుగునాడుప్రతినిధి) : మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ పదవుల్లో ఉన్న అధికారులు రిటైర్ అయిన తర్వాత ఆ రెండు బాధ్యతలను కూడా డిప్యూటీ ఇంజనీర్ (డీఈ)కి అప్పగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న మున్సిపాలిటీలో మూడు కీలక పదవులను ఒకే అధికారికి అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన మున్సిపాలిటీ ప్రస్తుతం "ఒకే వ్యక్తి వ్యవస్థ"గా మారిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కమిషనర్ చేయాల్సిన పరిపాలన, ఏఈ నిర్వహించాల్సిన సాంకేతిక పనులు, డీఈ బాధ్యతలు అన్నీ ఒకే అధికారి భుజాలపై వేయడం వెనుక ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయకుండా తాత్కాలిక ఏర్పాట్ల పేరుతో వ్యవస్థను నడిపించడం ప్రజా పాలనపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని బట్టబయలు చేస్తోందని విమర్శకులు అంటున్నారు.ఒక వైపు అభివృద్ధి, సుపరిపాలన అంటూ ప్రకటనలు చేస్తూ మరోవైపు కీలక పట్టణ సంస్థను పూర్తిస్థాయి అధికారుల్లేకుండా నడపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.మూడు వేర్వేరు బాధ్యతలు, మూడు వేర్వేరు విధులు, మూడు వేర్వేరు జవాబుదారీతనాలు ఒకే వ్యక్తికి అప్పగిస్తే చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రజలు నిలదీస్తున్నారు.ప్రతిపాదన కూడా అదే అధికారి, ఆమోదం కూడా అదే అధికారి, పర్యవేక్షణ కూడా అదే అధికారి అనే పరిస్థితి ఏర్పడితే పారదర్శకతకు అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు.మూడు కుర్చీలు.ఒక్క అధికారి ఇదేనా సుపరిపాలన ? అనే ప్రశ్న ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రజల నోట వినిపిస్తోంది.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0