ఎలక్ట్రిషియన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాతయ్య

Jan 27, 2026 - 21:23
 0  5
ఎలక్ట్రిషియన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాతయ్య

ఎలక్ట్రిషియన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట జనవరి27 (వెలుగు నాడు ప్రతినిధి ) :  పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎలక్ట్రిషన్స్ డే కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అసోసియేషన్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం విద్యుత్ రంగానికి పునాది వేసిన మహానుభావుడు సర్ థామస్ ఆల్వా ఎడిసన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ విద్యుత్ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఎలక్ట్రిషన్లు తమ సేవల ద్వారా ప్రజల నిత్యజీవితాన్ని సులభతరం చేస్తున్నారని కొనియాడారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్