కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన నమ్మకం
కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన నమ్మకం
ఘనంగా కూటమి విజయోత్సవ సభ
జగ్గయ్యపేట,జూన్19, ( వెలుగు నాడు ప్రతినిధి) : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) అన్నారు. పట్టణంలోని ఉక్కు కళా వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.విజయోత్సవ సభకు ముందు ఎమ్మెల్యే నివాసం వద్ద నుండి యువనాయకులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాది వాహనాలతో ఉత్సాహంగా పాల్గొని పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉక్కు కళా వేదికకు చేరుకుని విజయోత్సవ సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్ధిసంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి,పట్టణానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన అభివృద్ధి,సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీరాం సుబ్బారావునూకల కుమార్ రాజా, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, మేక వెంకటేశ్వర్లు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, చింతల సీతారామయ్య, కర్రి చిన్న, కన్నెబోయిన రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1