ఓటర్ల జాబితా సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి బత్తుల కృష్ణ

Jun 16, 2026 - 22:55
 0  8
ఓటర్ల జాబితా సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి బత్తుల కృష్ణ

ఓటర్ల జాబితా సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి బత్తుల కృష్ణ

ఇబ్రహీంపట్నం 15వ డివిజన్‌లో సార్ కార్యక్రమం ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది

ఇబ్రహీంపట్నం జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) : మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఖాజీమాన్యం 15వ డివిజన్ పోలింగ్ బూత్ నంబర్ 209లో మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం నిర్వహించారు. బిఎల్ఓ కిరణ్,వైసీపీ బీఎల్ఎ బత్తుల కృష్ణ ,టీడీపీ బీఎల్ఏ బండారు సాంబశివరావు,పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ బీఎల్ఏ బత్తుల కృష్ణ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ప్రజాస్వామ్యానికి అదే పునాది అన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సరిగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని సూచించారు. కొత్త ఓటు, అడ్రస్ మార్పు, తప్పుల సవరణ కోసం బీఎల్ఓలు అడిగిన పత్రాలను వెంటనే అందించి సహకరించాలని కోరారు. ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలమని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్