ఎస్సై వెలుగుల సురేష్‌కు ఘన సన్మానం టిడిపి మహిళా నాయకుల

Jan 30, 2026 - 11:26
Jan 30, 2026 - 11:26
 0  16
ఎస్సై వెలుగుల సురేష్‌కు ఘన సన్మానం టిడిపి మహిళా నాయకుల

ఎస్సై వెలుగుల సురేష్‌కు ఘన సన్మానం టిడిపి మహిళా నాయకుల అభినందనలు_ 

బాపులపాడు, జనవరి 29 (వెలుగు నాడు ప్రతినిధి ) : కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ వెలుగుల సురేష్‌ను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామానికి చెందిన టిడిపి మహిళా నాయకులు ఆయనను అభినందిస్తూ, పోలీస్ శాఖలో ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవలకుగాను ఎస్సై వెలుగుల సురేష్ అవార్డు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చినందుకే ఈ అవార్డు ప్రదానం చేసినట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకులు బేతాళ ప్రమీల రాణి, కొత్తూరు రేఖ, సింగవరపు దుర్గాప్రసాద్, బొమ్ములూరు గ్రామ టిడిపి కార్యకర్త కె. చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ఎస్సై వెలుగుల సురేష్‌ను అభినందించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్