శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు సీపీ సజ్జనర్

Mar 28, 2026 - 11:50
 0  7
శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు సీపీ సజ్జనర్

శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు సీపీ సజ్జనర్

హైదరాబాద్, మార్చి 27, (వెలుగు నాడు ప్రతినిధి) : హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపీఎస్ శుక్రవారం సీతారాం బాగ్ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనర్, నగరంలో నిర్వహించనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా, సాఫీగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. యాత్ర ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుండి ప్రారంభమై రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా సమగ్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను పూర్తిగా పరిశీలించామని, ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ భారీ శోభాయాత్ర కోసం సుమారు 3 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్ కలిసి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్