జిల్లా బిజెపి ఆధ్వర్యంలో సుజనా చౌదరి జన్మదినోత్సవ వేడుకలు
జిల్లా బిజెపి ఆధ్వర్యంలో సుజనా చౌదరి జన్మదినోత్సవ వేడుకలు
విజయవాడ జూన్ 02,( వెలుగు నాడు ప్రతినిధి) : మాజీ కేంద్ర మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ నాయకత్వంలో జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గం అంతట ఘనంగా నిర్వహించారు. భారతీయజనతాపార్టీ జిల్లా నాయకులు ముందుగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సుజనా చౌదరి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుజనా. ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా,ఉన్నత బాధ్యతలను నిర్వర్తించి ,ప్రస్తుతం విజయవాడలోనే ఒక విభిన్నమైన నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎదురులేని ఆధిక్యంతో గెలిచి, అటు ప్రభుత్వం ద్వారానూ ,ఇటు సుజనా ఫౌండేషన్ ద్వారాను,ప్రజలకు నిత్యం తన సేవా కార్యక్రమాలను అందిస్తూ ,ఏపీలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ అధినేతల మరియు ప్రజల ప్రశంసలు పొందుతున్న సమర్థవంతమైన నాయకులు, గొప్ప వ్యాపారవేత్త,అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తున్న ఏకైక ఆంధ్ర రాజకీయనేత, స్ఫూర్తి ప్రదాత,జనహృదయనేత,విద్యాదాత,, Y.సుజనా చౌదరి కి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కోరుకుంటూపశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతాపార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ లు కట్ చేసి వస్త్రాలు పంపిణీ,పండ్ల పంపిణీ,మజ్జిగ పంపిణీ,అన్నదానాలు చేసి డప్పు వాయిధ్యాలతో టపాసులు మోతలతో సుజనా చౌదరి నాయకత్వం వర్దిల్లాలి అనే నినాదాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయజనతా పార్టీ రాష్ట్ర హెడ్ క్వార్టర్ ఇంఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి,పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ మరియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0