ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే తాతయ్య

May 15, 2026 - 23:05
 0  29
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే తాతయ్య

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట మే15, (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు.ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ,మందుల అందుబాటు తదితర అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ,హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎలమంచిలి వెంకటలక్ష్మి, పద్మనాభుని కుటుంబరావు, గుడిసె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్