గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
జగ్గయ్యపేట,మే15, (వెలుగు నాడు ప్రతినిధి ) : నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం తనిఖీ నిర్వహించారు.గ్రామపంచాయతీలో ఒక కోటి 21లక్షల 66 వేల 859 రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు డీ ఎల్ పీ ఓ రాఘవన్ జిల్లా పంచాయతీ అధికారికి, జిల్లా కలెక్టర్ కు గతంలో నివేదిక సమర్పించారు.ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు గురువారం పెరుగంచిప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ రాఘవన్ , పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్ ,గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0