సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవం

Jun 1, 2026 - 23:00
 0  21
సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవం

సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవం

జగ్గయ్యపేట జూన్ 01, (వెలుగు నాడు ప్రతినిధి):బి వి సాగర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది.మే 3వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగిన ఈ శిక్షణా శిబిరంలో పెద్ద సంఖ్యలో యువ క్రికెటర్లు పాల్గొని క్రికెట్‌లోని మెళకువలను నేర్చుకున్నారు.సోమవారం జరిగిన క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందని, అందుకు ఇలాంటి కోచింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు బివి సాగర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.క్రీడల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.నెల రోజుల పాటు నిర్వహించిన ఈ కోచింగ్ క్యాంప్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్‌నెస్, మ్యాచ్ స్ట్రాటజీ తదితర అంశాలపై నిపుణులైన కోచ్‌లు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు గుడిసె నాగేశ్వరరావు,బి వి సుధీర్, గడ్డన్న,పితాని శ్రీనాథ్,నారసాని శివ,పసుపులేటి శ్రీనివాసరావు, జె ప్రవీణ్, కోచ్‌లు ఎన్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్