పాత పద్ధతిలోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Jun 12, 2026 - 22:15
Jun 12, 2026 - 22:16
 0  2
పాత పద్ధతిలోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

పాత పద్ధతిలోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

మైలవరం జూన్ 12, (వెలుగునాడు ప్రతినిధి) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు ఉన్న పాత పద్ధతిలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్‌లకు పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిల్లి నరసింహారావు, పి. అప్పారావు డిమాండ్ చేశారు.శుక్రవారం మైలవరం సీఐటీయూ కార్యాలయంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మైలవరం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు,ఎం.సురేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లి నరసింహారావుమాట్లాడుతూ,సీఐటీయూ పోరాటాల ఫలితంగా మార్చి 1 నుంచి సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందన్నారు.2009లో వచ్చిన సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద మరణం,వివాహ కానుక,ప్రసూతి కానుక,అంత్యక్రియల ఖర్చులు,వైద్య సహాయం,మృతదేహం తరలింపు సహాయం,పిల్లలకు స్కాలర్‌షిప్ వంటి పథకాలు కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచాయన్నారు.2020లో నవరత్నాల పేరుతో అప్పటి ప్రభుత్వం అన్ని పథకాలను ఆపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చి,తూతూ మంత్రంగా 4 పథకాలు మాత్రమే ప్రకటించిందని విమర్శించారు.ఆ పథకాలకు పెట్టిన నిబంధనలతో ఒక్క పథకం కూడా కార్మికులకు సవ్యంగా అందడం లేదన్నారు.లేబర్ ఆఫీసర్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు,ఆధార్ కార్డు ఆధారంగా నిబంధనలు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం జూన్ 15న రాష్ట్రవ్యాప్తంగా ఏఎల్వో కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నామని,కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైలవరం మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్