అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల దాడులు నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్

Jun 2, 2026 - 22:25
Jun 2, 2026 - 22:27
 0  23
అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల దాడులు నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్

అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల దాడులు నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్

తిరువూరు జూన్ 02, )వెలుగు నాడు ప్రతినిధి) నియోజకవర్గ పరిధిలోని, రాజీవ్ నగర్ ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ మట్టి తరలిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు సంబంధిత శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు మరియు ఒక జేసీబీని అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ మట్టి తవ్వకాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా మట్టి తవ్వడం, రవాణా చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ మట్టి తవ్వకాలపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. రాజీవ్ నగర్‌లో జరిగిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అక్రమ తవ్వకాల నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలను పలువురు ప్రజలు అభినందిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్