తెలంగాణకు మరో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు
తెలంగాణకు మరో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు
తెలంగాణ, జనవరి 17, (వెలుగు నాడు ప్రతినిధి ) : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త అందించింది. అమృత్ భారత్ కేటగిరీలో చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య మరో రెండు కొత్త రైళ్లను కేటాయించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0