మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

Feb 22, 2026 - 23:55
 0  10
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం సర్పంచ్ పామేన రాములు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు లో ఎమ్మెల్యే కాలే యాదయ్య 

చేవెళ్ల,ఫిబ్రవరి 22 ( వెలుగు నాడు ప్రతినిధి) : ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. తంగడపల్లి మజీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా *ఎమ్మెల్యే మాట్లాడుతూ* ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలోని కులమతాలకు అతీతంగా గ్రామ పెద్దలు ముస్లిం యువకులు తదితరులు పాల్గొన్నారు...

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్