మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మంథని మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మంథని మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం
మంథని, ఫిబ్రవరి 09 ( వెలుగు నా డు ప్రతినిధి ): మంథని పట్టణంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8వ,వార్డు అభ్యర్థి లైశెట్టి రజిత రాజు,9వ వార్డ్ మారుపాక నిహారిక నాగరాజు, 4వ మద్దకట్ల స్రవంతి రమేష్ బాబు,5వ వార్డ్ ముస్కుల సయేందర్ రెడ్డి రెడ్డి.7వ వార్డు జంబోజి శ్రీమతి సమ్మయ్య వార్డులలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంథని మున్సిపల్ ప్రజలను రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పట్టణ అభివృద్ధికి చాలా నిధులను కేటాయించి అభివృద్ధి పనులను నడుస్తున్నాయని అన్నారు. రానున్న రోజులలో మరింత అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించుకొని మంథని పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0