మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం బీజేపీకి కొత్త ఆశలు

Jan 18, 2026 - 23:17
 0  3
మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం బీజేపీకి కొత్త ఆశలు

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం బీజేపీకి కొత్త ఆశలు

తెలంగాణ, జనవరి 18, (వెలుగు నాడు ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్‌పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తెలంగాణలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి పార్టీ కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేస్తూ, అదే తరహా ఫలితాలు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లోనూపునరావృతమవుతాయని తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్