తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ నిబంధనలు విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ నిబంధనలు విడుదల
తెలంగాణ, జనవరి 19, ( వెలుగు నాడు ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ పార్టీ నుంచి బీ–ఫామ్ పొందాల్సి ఉంటుంది. ఈ బీ–ఫామ్‌ను నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన గడువు ముగిసేలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. పార్టీ అభ్యర్థిని ప్రతిపాదించేందుకు ఒక్క ఓటరు మద్దతు ఉంటే సరిపోతుంది. ఇక స్వతంత్ర అభ్యర్థుల విషయంలో, వారు పోటీ చేయదలచుకున్న వార్డుకు చెందిన కనీసం 10 మంది ఓటర్ల మద్దతు తప్పనిసరి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0