కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి.

Mar 11, 2026 - 19:20
 0  2
కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి.

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి.

తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ను తనికి చేసిన కలెక్టర్.

సిద్దిపేట, మార్చి 11,(వెలుగు నాడు ప్రతినిధి) : చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థులు తినేటప్పుడు అరవడం తిన్న మెతుకులు కింద పడడం చూసి అసహనం వ్యక్తం చేశారు.విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కూడిన అలవాట్లను నేర్పించాలని పిఈటి లను హెచ్చరించారు.అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా శుభ్రంగా ఒక్క మెతుకు కూడా కింద పడనియ్యకుండా తినాలని విద్యార్థులకు సూచించారు.మళ్ళీ విసిట్ కు వస్తానని విద్యార్థులకు ప్రవర్తనలో మార్పు రాకుంటే సహించేది లేదని సిబ్బందిని ఆదేశించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్