గుడి లేని దేవతలకు నీరాజనం 

Jan 19, 2026 - 23:21
 0  3
గుడి లేని దేవతలకు నీరాజనం 
గుడి లేని దేవతలకు నీరాజనం 
గుడి లేని దేవతలకు నీరాజనం 

గుడి లేని దేవతలకు నీరాజనం 

ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారక్క

ఆదివాసి ప్రజలు ప్రేమగా ఆరాధించుకునే దేవతలు

భిన్నత్వంలో బహుళత్వం మేడారం జాతర ప్రత్యేకత 

మేడారానికి నీరాజనం

తెలంగాణ, జనవరి 19, ( వెలుగు నాడు ప్రతినిధి) :  గుడి లేని దేవతలు సమ్మక్క సారక్కల మహా జాతర జనవరి 28న ప్రారంభం కానున్నది.ఆసియాలో రెండవ అతిపెద్ద గిరిజన జాతర మేడారం.దేశం నలుమూలల నుండి తరలివచ్చే లక్షలాది భక్తులు తూర్పు తీరాలకు చేరుకుంటారు. చిలకలగుట్ట నుండి సమ్మక్క రాక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.సమ్మక్క సారక్క గద్దెల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణతో శోభాయ మనంగా కనిపిస్తుంది.పౌర్ణమి రాత్రి సమ్మక్క దర్శనంతో భక్తులు ప్రజలు పొంగిపోతారు.తమ ఇష్ట దైవాలకు 

సారాయి, మాంసంతో ప్రసాదం ప్రసాదం నివేదిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతర

బహుజనుల ఐక్యత చాటే అతిపెద్ద ఉత్సవం. ఆదివాసీలు బహుజనుల 

విశ్వాసాలతో ముడిపడి ఉన్న సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది.మేకలు, కోళ్లు బలి ఇవ్వడం ఇక్కడ సాధారణ ఆచారం.

కాకతీయ రాజుల కాలంలో 700 సంవత్సరాల క్రితం కరువు కాలములో కూడా పన్నులు కట్టాలని వేధిస్తే తిరగబడి పోరు చేసిన త్యాగధనులు, పోరు బిడ్డలు సమ్మక్క సారక్కలు. వారిని ఆదివాసీలు ప్రేమగా ఆరాధ్య దేవతలుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొలుస్తున్నారు. ఆదివాసి సమాజం, తెలంగాణ సమాజం, ఆదివాసి సంప్రదాయం, సంస్కృతి దాని యొక్క భిన్నత్వం ప్రకృతిని ఆరాధించే కోయ వాళ్ళ గొప్పదనం ఔన్నత్యం మనకు కనిపిస్తుంది.ఆరు రాష్ట్రాల ప్రజలు జాతర సమయంలో ఒక్క చోటికి చేరుతారు.కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. విద్వేషాలకు అతీతంగా ప్రేమపూర్వకంగా ఒకచోట కలుస్తారు. త్యాగదనులైన సమ్మక్క సారక్క స్ఫూర్తిని, చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్