నిరుపేదల సేవలో పరిపూర్ణ బాలల ఆశ్రమం
నిరుపేదల సేవలో పరిపూర్ణ బాలల ఆశ్రమం
తిరువూరు, జనవరి 24, (వెలుగు నాడు ప్రతినిధి ) : గత నాలుగు సంవత్సరాలుగా అనాధ, నిరాశ్రయ, పేద బాల బాలికలకు ఆశ్రయం, చదువు, వసతి, ఆరోగ్య సంరక్షణతో పాటు భవిష్యత్తుకు దారి చూపుతూ పరిపూర్ణ బాలల ఆశ్రమం సమాజంలో ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఆశ్రమాన్ని నిర్వాహకులైన సిరికొండ నాగేశ్వరరావు మరియు సెక్రటరీ వరలక్ష్మి అంకితభావంతో ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోని అనాధ, పేద, నిరాశ్రయ బాల బాలికలను ఉద్దేశించి మరోసారి నిర్వాహకులు హృదయపూర్వక పిలుపునిచ్చారు. చదువుకు దూరమవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షిత వసతి, ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.ప్రత్యేకంగా తిరువూరు ప్రాంతంలోని నాలుగు మండలాల్లో ఉన్న అనాధ చిన్నారులతో పాటు జిల్లా వ్యాప్తంగా అర్హత గల బాల బాలికలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి, వారికి ఉచితంగా విద్య అందించేందుకు పరిపూర్ణ బాలల ఆశ్రమం నిరంతరం కృషి చేస్తోంది.ఇప్పటికే ఈ ఆశ్రమం ద్వారా ఎంతోమంది పిల్లలు చదువులో ముందుకు వెళ్లి, మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుండటంతో ఆశ్రమ సేవలను ప్రజలు విస్తృతంగా కొనియాడుతున్నారు. “సేవే ధ్యేయంగా, విద్యే ఆయుధంగా” చిన్నారుల జీవితాలను మార్చుతున్న పరిపూర్ణ బాలల ఆశ్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసించారు.అనాధ బాల బాలికల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలని, అర్హత గల చిన్నారులను ఈ అవకాశానికి చేరవేయాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పరిపూర్ణ బాలల ఆశ్రమం చేపడుతున్న ఈ సేవలు రానున్న తరాలకు బలమైన పునాదిగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అన్నదానం మరియూ నిత్యావసర వస్తువులు, సరుకులు, బియ్యం తదితర వస్తువులు ఇచ్చే దాతలకోసం చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9490061679 నంబర్ కి ఫోన్ చేయవలసిందిగా ఆయన కోరారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0