మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం

Jan 27, 2026 - 20:21
 0  6
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం

పటాన్చెరు జనవరి 27,(వెలుగు నాడు ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉట్ల గ్రామంలో ఇన్‌చార్జ్ బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ నాయకుడు వెంకటేశం గౌడ్ జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ విజయ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి పాలన వరకు ప్రజల పక్షాన నిలబడి పనిచేసిన ఏకైక పార్టీ అని నాయకులు పేర్కొన్నారు.తెలంగాణ సాధన ఉద్యమం నుంచి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు నిరాశ చెందుతున్న ఈ సమయంలో, బీఆర్ఎస్ మాత్రమే మాటకు కట్టుబడి పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజల నమ్మకమే బీఆర్ఎస్ బలం అని, కార్యకర్తల శ్రమే పార్టీ విజయానికి పునాది అని నాయకులు స్పష్టం చేశారు.జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం అని సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్