బాద్‌లో 54 మంది సీఐల బదిలీ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

Jan 19, 2026 - 23:08
 0  3
బాద్‌లో 54 మంది సీఐల బదిలీ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

హైదరాబాద్‌లో 54 మంది సీఐల బదిలీ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

హైదరాబాద్, జనవరి 19, (వెలుగు నాడు ప్రతినిధి) : హైదరాబాద్ సిటీలో పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులతో మొత్తం 54 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో సీసీఎస్ (సైబర్ క్రైమ్ స్టేషన్) నుంచి ఎక్కువ మంది ఇన్‌స్పెక్టర్లను ఇతర విభాగాలకు మార్చినట్టు సమాచారం. అలాగే, 26 మంది సీఐలను సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.ఈ నిర్ణయం హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందని, ఫీల్డ్ లెవెల్‌లో పనితీరుపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్