మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు 

Feb 7, 2026 - 21:03
 0  2
మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు 

మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు 

వార్డులలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 

మిర్యాలగూడ ఫిబ్రవరి 07 (వెలుగు నాడు ప్రతినిధి ) : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో18,19,37,42,43,44,48,46,27,28,24,1,2,13 వార్డులలో ప్రచారంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గడపగడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసి మనకి అప్పగించారు.ఐనా కూడా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు నుంచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్ధుతూ, నిరుపేదలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తుంది.కావున మనం అంతా ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.రానున్న మూడు సంవత్సరాలలో మరిన్ని సంక్షేమాలను పేదలకు అందిస్తామని తెలియజేస్తూ ప్రతిఒక్కరు మిర్యాలగూడ మున్సిపాలిటీ లోని 48 వార్డులలో తమ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యులు అవ్వాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, బ్రదర్స్,తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్