దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గళం.ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో విశ్వాసం
దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గళం.ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో విశ్వాసం.
సిద్దిపేట, ఫిబ్రవరి 08 ( వెలుగు నాడు ప్రతినిధి) : దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 15, 16, 19, 20వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రజల గడపగడపకు చేర్చి విజయవంతంగా అమలు చేసిన ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ప్రతి ఇంటికి నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తూ సామాజిక న్యాయంసమగ్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటరిపై ఉందని, ప్రజలంతా ఐక్యంగా కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0