బిఆర్ఎస్ పాలనలో దుబ్బాకను దోచుకున్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్.

Feb 8, 2026 - 22:02
 0  12
బిఆర్ఎస్ పాలనలో దుబ్బాకను దోచుకున్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్.

బిఆర్ఎస్ పాలనలో దుబ్బాకను దోచుకున్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్.

సిద్దిపేట, ఫిబ్రవరి 08, ( వెలుగునాడు ప్రతినిధి ) : బిఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి కుంటూపడిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.దుబ్బాక నిధులను గత పాలకులు సిద్దిపేటకు తరలించి దుబ్బాక కు అన్యాయం చేయడం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు పాటించని టి పి సి సి ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి పై కఠినంగా వ్యవహరిస్తామనిహెచ్చరించారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ రామలింగారెడ్డి కాలనీ, చేరువాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇండిపెండెంట్ మద్దతుగా ప్రచారం నిర్వహించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి పై అధిష్టానానికి సూచించడం జరిగిందని తెలిపారు.అధిష్టానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సన్నబియ్యం, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే దుబ్బాక బస్ డిపోకు 10 బస్సులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడడం తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కెసిఆర్ ఇంట్లో దోచుకున్న డబ్బుల వాటాల విషయంలో పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు.ఇప్పటికైనా మున్సిపాలిటీలోని ఓటర్లు ఆలోచించి బిఆర్ఎస్, బిజెపి పార్టీల అభ్యర్థులకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్