యూరియా కోసం రైతుల ధర్నా
యూరియా కోసం రైతుల ధర్నా
మునుగోడు, జనవరి 24, (వెలుగు నాడు ప్రతినిధి) : మునుగోడు మండల కేంద్రంలో యూరియా, పంపిణీలో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మునుగోడులో రైతులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం ఫెర్టిలైజర్ వికాస్ యోజన యాప్ కారణంగా స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ భాష సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు పాత పద్ధతిలోనే సొసైటీలలో ఫెర్టిలైజర్ షాపులో యూరియాను అందజేయాలని కోరారు వరి నాట్లు పూర్తయి నెలరోజు గడిచిన యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం స్థానిక తాసిల్దార్ నేలపట్ల నరేష్ కు మెమోరడం అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చలి మేడ సర్పంచ్ బండమీది యాదయ్య,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి,బిలాలు సిపిఐ మండల సహాయ కార్యదర్శి మందుల పాండు,సతీష్ కుమార్,మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాస్,దుబ్బ వెంకన్న,ముంత నరసిం,హ బైరుగొండ వెంకన్న,కురుమర్తి ముత్తయ్య,బి నరసింహ,నందిపాటి ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఉదయ్ కుమార్,కట్కూరి లింగస్వామి,మిర్యాల యాదయ్య,బి కిరణ్,తదితరులు పాల్గొన్నారు..
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0