గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయం

Mar 1, 2026 - 22:39
 0  12
గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయం

గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయం

ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

 జగ్గయ్యపేట,మార్చి 01, (వెలుగు నాడు ప్రతినిధి)  : మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు.పెనుగంచిప్రోలు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య ఆధ్వర్యంలో విజయవాడ స్రవంతి హాస్పిటల్ డాక్టర్ల బృందంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో270 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ఉచిత వైద్య శిబిరాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు..స్రవంతి హాస్పటల్ డాక్టర్ విజయ్ శ్రీనివాస్ తో పాటు డాక్టర్లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.మాజీ డిసి చైర్మన్ వేగినటి గోపాలకృష్ణమూర్తి,సొసైటీ అధ్యక్షులు కర్ల వెంకటనారాయణ,ఉమ్మనేని పుల్లారావు, కర్ల కోటేశ్వరి,చుంచు రమేష్ బాబు,గజ్జి కృష్ణమూర్తి,జిల్లేపల్లి సుధీర్ బాబు,నల్లపునేని కొండ,విజయవాడ తెదేపా పార్లమెంటరీ అధికార ప్రతినిధి నల్లమోలు శివరామకృష్ణ ప్రసాద్, కాకానిబ్రహ్మం,గుగులోతు రమేష్ కొలిపాక బ్రహ్మం ,మహమ్మద్ అజాద్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్