గవర్నర్‌గా పదవీ బాధ్యతలు వినమ్రతతోభావంతో స్వీకరిస్తూఇది నాకు గొప్ప వరం 

Mar 12, 2026 - 02:55
Mar 12, 2026 - 02:55
 0  4
గవర్నర్‌గా పదవీ బాధ్యతలు వినమ్రతతోభావంతో స్వీకరిస్తూఇది నాకు గొప్ప వరం 

గవర్నర్‌గా పదవీ బాధ్యతలు వినమ్రతతోభావంతో స్వీకరిస్తూఇది నాకు గొప్ప వరం 

హైదరాబాద్, మార్చి 11  (వెలుగు నాడు ప్రతినిధి) : నాపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణా ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం.నేను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన అనుభవం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంటిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి, సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న తెలంగాణా ప్రభుత్వానికి, కేబినెట్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామని విశ్వసిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా, నేను సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటాను.నా విధులను న్యాయబద్ధంగా,నిజాయితీగా,భారత రాజ్యాంగానికి అనుగుణంగా అంకితభావంతో నిర్వహిస్తాను. మనమందరం సమిష్టిగా సుసం‍పన్నమైన తెలంగాణా రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్