కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేత
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేత
జగ్గయ్యపేట ఫిబ్రవరి 03 (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో రీ సర్వే చేయబడి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మంగళవారం గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు తాతయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు.గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో జారీ చేసిన పాసు పుస్తకాల్లో తప్పిదాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.అన్ని ఇబ్బందులను అధిగమించి జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ బుక్ లను రైతులకు అందజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, ఎమ్మార్వో మనోహర్ ,జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, రైతులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0