దుర్గంధభరితంగా మారిన బస్ స్టేషన్ ప్రయాణికుల ఆవేదన

Feb 27, 2026 - 01:02
 0  2
దుర్గంధభరితంగా మారిన బస్ స్టేషన్ ప్రయాణికుల ఆవేదన

దుర్గంధభరితంగా మారిన బస్ స్టేషన్ ప్రయాణికుల ఆవేదన

తిరువూరు ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు బస్ స్టేషన్ పరిసరాలు దుర్గంధభరితంగా మారాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్ స్టేషన్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో తీవ్ర అసౌకర్యం నెలకొంది. మరుగుదొడ్లలోని నీరు, మలమూత్రాలు బయటికి పొంగి రావడం వల్ల బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ప్రయాణికులు, దుకాణదారులు, స్థానిక ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సెప్టిక్ ట్యాంకులు సమయానుకూలంగా శుభ్రపరచకపోవడం, సరైన పారిశుధ్య చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. పలుమార్లు సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరుగుదొడ్లను శుభ్రపరచి, సెప్టిక్ ట్యాంకులను ఖాళీ చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్