సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

Feb 8, 2026 - 22:12
 0  7
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

పెద్దపల్లి ,ఫిబ్రవరి 08( వెలుగు నాడు ప్రతినిధి ) : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తో కలిసి అశోక్ నగర్, రమేష్ నగర్, చంద్ర శేఖర్, 7 ఎల్ ఈ పి, తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలను డీసీపీ అధికారులతో చర్చించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ కు వచ్చే ఓటర్లకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్