తిరువూరులో రంజాన్ తోఫా పంపిణీ 

Feb 27, 2026 - 01:04
 0  9
తిరువూరులో రంజాన్ తోఫా పంపిణీ 

తిరువూరులో రంజాన్ తోఫా పంపిణీ 

తిరువూరు ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు పట్టణంలోని లైన్ బజార్‌లో అభిదా ఇంటి వద్ద “అభిదా ఆరిఫ్ & సన్స్” పేరిట అల్లాహ్ దైవ సేవకురాలు అభిదా ఖాతున్ పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పేద మహిళలు పాల్గొన్నారు.వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేయడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రంజాన్ పండుగను ప్రతి పేద కుటుంబం సంతోషంగా జరుపుకోవాలనే సంకల్పంతోనే ఈ తోఫా పంపిణీ చేస్తున్నట్లు అభిదా తెలిపారు.ప్రతి ఏడాది ఇదే విధంగా సహాయ కార్యక్రమాలు చేపడుతూ, అవసరమైన వారికి తోడ్పాటు అందిస్తున్న అభిదా ఖాతున్ సేవలను స్థానిక ముస్లిం ప్రజానీకం అభినందించింది. ఆమె సేవా భావం మరెందరికో ఆదర్శంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ప్రాంతంలో సామాజిక ఐక్యతను, పరస్పర సహకారాన్ని మరింత బలపరిచింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్