తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

Feb 4, 2026 - 02:30
 0  3
తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ, ఫిబ్రవరి 3, (వెలుగు నాడు ప్రతినిధి ) :మాజీముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు' వేడుకలను ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి రావి నారాయణ రెడ్డి జాతీయ స్మారక అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనలపై ఆయన ఘాటుగాస్పందించారు.తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా.అని కొందరు ప్రశ్నించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఆదర్శం ఏమిటి. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని రేవంత్ ప్రశ్నించారు.నిజంగా ఆయన జాతిపిత అయితే, ఏ విషయంలో ఆదర్శంగా నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ ఇక్కడ రాజులు, చక్రవర్తులు కాదని.ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమకారుల అణచివేతపై విమర్శలు.గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను గౌరవించామన్న వాదనను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు.ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అప్పట్లో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయలేదా అని నిలదీశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అలా ఈడ్చుకెళ్లిన సందర్భం లేదని, తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగినందునే అధికారులు నోటీసులు ఇచ్చారని, అందులో రాజకీయం ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.నేను ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలని కోరడం ఏంటి చట్టం ముందు అందరూ సమానమే. చేసిన తప్పుకు సమాధానం చెప్పాల్సిందే' అని రేవంత్ రెడ్డి చురకలంటించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్