మహా శివరాత్రి వేళ తిరువూరు ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు

Feb 16, 2026 - 22:57
 0  9
మహా శివరాత్రి వేళ తిరువూరు ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు

మహా శివరాత్రి వేళ తిరువూరు ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్యాత్మిక సంకల్పం

తిరువూరు ఫిబ్రవరి 16 (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలోని నీలాద్రి అటవీ ప్రాంతంలో వెలసిన శివాలయాన్ని దర్శించారు. నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి తిరువూరులో నెలకొన్న పలు సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని పరమేశ్వరుని ప్రార్థించారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు మరింత ఫలప్రదంగా మారాలని, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు పనితీరుతోనే సమాధానం ఇస్తానని, తిరువూరు అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మహా శివరాత్రి సందర్భంగా ప్రజల క్షేమం కోసం చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నియోజకవర్గంలోచర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే చేసిన ఈ ప్రత్యేక పూజలు తిరువూరు ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్