శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహణ

Mar 28, 2026 - 11:57
 0  26
శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహణ

శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహణ

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు

ఎన్టీఆర్ బ్యూరో మార్చి 27 (వెలుగునాడు ప్రతినిధి) :  స్టెల్లా కాలేజి సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ దంపతులు హాజరై సీతా రాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి.జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వాహకులు వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, పూజా కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని వారు భక్తిపూర్వకంగా నిర్వహించారు .ఆలయ పరిసరాలు మంగళవాయిద్యాల నినాదాలతో మార్మోగాయి. వేదపండితులు వేదమంత్రోచ్చారణల మధ్య యాగాలు, హోమాలు నిర్వహించగా, అనంతరం సీతారాముల కల్యాణోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్