50 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి కావాలిజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Jan 30, 2026 - 19:01
 0  9
50 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి కావాలిజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

50 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి కావాలిజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో పంట పోలాల పరిశీలన

ఆయిల్ ఫామ్ పంట పోలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జనవరి 30,( వెలుగు నాడు ప్రతినిధి ) : ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం రంగాపూర్,గట్టి సింగారం గ్రామాలలో రవీందర్ రెడ్డి అనే రైతు నూతనంగా సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంట పొలాలను ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రంగా పూర్, గట్టి సింగారం గ్రామాలలో రైతులందరూ కలిసి 100 ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట ప్రోత్సహించేందుకు ఇక్కడ గుట్ట పై విద్యుత్ సరఫరా నిమిత్తం 9 లక్షల రూపాయలు కలెక్టరేట్ నుంచి కేటాయించి పనులు పూర్తి చేసామని కలెక్టర్ పేర్కొన్నారు.ఫిబ్రవరి నెలలో 50 ఎకరాలలో ఆయిల్ మొక్కల నాటే పనులు పూర్తి కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్