ప్రయాణికుల దాహార్తికి శాశ్వత పరిష్కారం - తిరువూరు బస్టాండ్ లో నీటి శుద్ధి యంత్రం

Feb 16, 2026 - 23:00
 0  2
ప్రయాణికుల దాహార్తికి శాశ్వత పరిష్కారం - తిరువూరు బస్టాండ్ లో నీటి శుద్ధి యంత్రం

ప్రయాణికుల దాహార్తికి శాశ్వత పరిష్కారం - తిరువూరు బస్టాండ్ లో నీటి శుద్ధి యంత్రం

శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చే ఘనంగా ప్రారంభం

తిరువూరు ఫిబ్రవరి 16 (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని (ఏపీఎస్ ఆర్టీసీ) బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్‌లో శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులో ఉండటం ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. సిబ్బందికి కూడా ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ఈ వాటర్ ప్లాంట్‌ను కీ.శే. నూతక్కి వెంకట రామారావు స్మారకార్థం ఆయన కుమారులు నూతక్కి వెంకట రమేష్ బాబు, నూతక్కి వేణు గోపాలరావు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.ప్రారంభోత్సవం అనంతరం మహిళా ప్రయాణికుల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ సిబ్బంది, పట్టణ కూటమి పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.ప్రజా సేవే లక్ష్యంగా తిరువూరులో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది మరో ముఖ్యమైన అడుగుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్