పాఠశాలకు మైక్ సెట్ బహుకరించిన పూర్వ విద్యార్థులు
పాఠశాలకు మైక్ సెట్ బహుకరించిన పూర్వ విద్యార్థులు
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 21, (వెలుగు నాడు ప్రతినిధి) : స్థానిక ప్రభుత్వ ఉన్నత ( బాలుర) పాఠశాలలో చదివిన 1974-75 సవత్సరపు పదవ తరగతి విద్యార్దినీ,విద్యార్దులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు మైక్ సెట్ ను శనివారం బహుకరించారు.ఇటీవల అప్పటి విద్యార్థులందరూ అదే పాఠశాలలో కలుసుకున్నపుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.అనుకున్న మాట ప్రకారం మైక్ సెట్ ను పాఠశాలకు బహుకరించినట్లుగా పసుపుల పుల్లారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మొరిశెట్టి రంగారావు,వీరవళ్ళి శ్రీనివాసరావు,రంగా వెంకటనారాయణ, పబ్బిసెట్టి టాండన్ ,హై స్కూల్ హెడ్ మాస్టర్ పారేపల్లి వెంకట నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1