అమ్మవారి నగర సంకీర్తన జ్యోతి కార్యక్రమం
అమ్మవారి నగర సంకీర్తన జ్యోతి కార్యక్రమం
జగ్గయ్యపేట, జనవరి 21,( వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వాముల దీక్షా గురు స్వామీ రంగుల శీను భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారి నగర సంకీర్తన జ్యోతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మర్రిబోయిన సూరి బాబు ప్రారంభించారు. పట్టణంలోని దీక్షా స్వాములే కాకుండా చుట్టుపక్క గ్రామాల దీక్ష స్వాములు పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. దీక్ష తీసుకున్న ప్రతి స్వామి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని జ్యోతి స్వరూపంగా భావించి అఖండ దీపాన్ని పట్టణంలో ఊరేగింపుగా నిర్వహించారు.అనంతరం దీక్ష స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగుల శ్రీను గురు స్వామి, కావేటి రాంబాబు స్వామి, గడ్డం రాంబాబు యాదవ్ స్వామి, భాస్కర్ స్వామి, గ్రామాల దీక్ష గురు స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0