నారా లోకేష్ నివాసంలో కూటమి నేతలతో ఆత్మీయ విందు

Feb 14, 2026 - 22:02
 0  26
నారా లోకేష్ నివాసంలో కూటమి నేతలతో ఆత్మీయ విందు

నారా లోకేష్ నివాసంలో కూటమి నేతలతో ఆత్మీయ విందు

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 14,( వెలుగు నాడు ప్రతినిధి) నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , శ్రీరాం శ్రీదేవి (అమ్మాజీ) కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా లోకేష్ బాబు ప్రత్యేకంగా శాసనసభ్యుల పిల్లలతో ముచ్చటిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించి, దగ్గరకు తీసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శాసనసభ్యులు వెళ్లిన తర్వాత కూడా పిల్లలతో కొంతసేపు గడిపి వారి భవిష్యత్తుపై ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు.శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య తనయులు శ్రీరాం కృష్ణ పవన్, శ్రీరాం ధనుంజయ (చినబాబు) తనయుడు శ్రీరాం కృష్ణ సిద్ధార్థ రాయ్ వీరంతా గతంలో లోకేష్ తో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు చూపించగా, పిల్లల్లో వచ్చిన మార్పును గమనించిన లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణతో ముందుకు సాగి భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని ఆశీర్వదించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్