ప్రజా దర్బారులో వినతుల వెల్లువ
ప్రజా దర్బారులో వినతుల వెల్లువ
జగ్గయ్యపేట,మే15, (వెలుగు నాడు ప్రతినిధి ) : మండలంలోని గౌరవరం గ్రామంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బారుకు మండల ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది.ఎమ్మెల్యే తాతయ్య స్వయంగా ప్రజల నడుమ కూర్చొని, గ్రామస్తుల సమస్యలను ఓపిగ్గా వింటూ అర్జీలను స్వీకరించారు. ఏ ఒక్కరి సమస్య కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజాదర్బారుకు వచ్చిన ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజల నుండి మొత్తం 230 అర్జీలు వచ్చాయి.వీటిలో పెన్సన్ల కు,గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అర్జీలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,ఎమ్మార్వో,జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,గౌరవరం సర్పంచ్ ముత్తవరపు పావని వెంకటేష్, జగ్గయ్యపేట మండలం సమైక్య అధ్యక్షురాలు నాయిని రజిని, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0