మార్చి 6 నుంచి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సిఎం రేవంత్

Mar 1, 2026 - 21:58
 0  2
మార్చి 6 నుంచి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సిఎం రేవంత్

మార్చి 6 నుంచి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సిఎం రేవంత్

హైదరాబాద్, మార్చి 1, (వెలుగు నాడు ప్రతినిధి ) :  తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు మార్చి 6 నుంచి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక దిశానిర్దేశాలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో కాకుండా స్వంత భవనాల్లోనే కొనసాగాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి కావాలని ఆదేశించారు. కంపెనీల ఒప్పందాలు, పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్‌లో అమలు కావాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని సూచించారు.100 నియోజకవర్గాల్లో TG పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పరిపాలనలో పారదర్శకత, వేగం ఫలితాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్