బాల సాహిత్య రచయిత నాగుల్ మీరాకు ఘన సన్మానం

Feb 22, 2026 - 23:49
 0  4
బాల సాహిత్య రచయిత నాగుల్ మీరాకు ఘన సన్మానం

బాల సాహిత్య రచయిత నాగుల్ మీరాకు ఘన సన్మానం

యూటీఎఫ్ అభినందనలు

జగ్గయ్యపేట,ఫిబ్రవరి 22, (వెలుగు నాడు ప్రతినిధి ) : అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమీ పూర్వ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ కవుల మహాసభలు ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండలం, మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హిందీ ఉపాధ్యాయులు, బాల సాహిత్యం రచయిత షేక్ నాగుల్ మీరాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చేతుల మీదగా పలువురు కవులను ఘనంగా సత్కరించారు.నాగుల్ మీరా రచించిన ' మీరా మన్ హర్ ' పిల్లల నాటికల పుస్తకం గురించి పలువురు వక్తలు కొనియాడారు.అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం రోజున నాగుల్ మీరా సన్మానం పొందిన సందర్భంగా మల్కాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( యూటీఎఫ్ )జగ్గయ్యపేట మండల శాఖ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్