రంజాన్ ఏర్పాట్లపై జిల్లా అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశం

Jan 25, 2026 - 00:16
 0  6
రంజాన్ ఏర్పాట్లపై జిల్లా అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశం

రంజాన్ ఏర్పాట్లపై జిల్లా అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశం

రంగారెడ్డి జిల్లా ,జనవరి 24 ( వెలుగు నాడు ప్రతినిధి) : జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో పవిత్ర రంజాన్ మాసం–2026 సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకునేలా పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, మసీదులు, ప్రజా ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. మత పెద్దలు విద్యుత్, స్ట్రీట్ లైట్స్, మంచినీరు, వీధి కుక్కల నియంత్రణ సమస్యలను ప్రస్తావించగా, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ రెడ్డి, పోలీస్, విద్యుత్, ఆర్&బీ అధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్