ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జగ్గయ్యపేట, మార్చి 29, (వెలుగునాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట పట్టణంలో, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ , జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యుల వారి నివాసం నుండి భారీ ర్యాలీగా ప్రారంభమై ముక్త్యాల రోడ్డు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం ఉక్కుకళా వేదికలో నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 44 ఏళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించే విధంగా డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను ఘనంగా సన్మానించి వారికి దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని తెలిపారు. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.లోకసభలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ, దేశంలో కాంగ్రేసేతర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా ముఖ్యపాత్ర పోషించిందన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయం సామాన్య ప్రజల ముంగిటికి చేరిందని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించబడినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి పార్టీ విశేష కృషి చేసిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పగా, నారా చంద్రబాబు నాయుడు తెలుగువారి మేధస్సును ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు.ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు.అలాగే నారా లోకేష్ ప్రజల మధ్య పాదయాత్ర చేసి వారి సమస్యలను తెలుసుకొని, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారని తెలిపారు. చివరగా, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీరాం సుబ్బారావు, మల్లెల సీతమ్మ, రంగాపురం రాఘవేంద్ర, మేక వెంకటేశ్వర్లు, నూకల కుమార్ రాజా, మైనేని రాధాకృష్ణ, కట్ట నరసింహారావు, సంక వెంకట్రావు, కన్నెబోయిన రామలక్ష్మి, దూళిపాల లక్ష్మణరావు, కర్రీ శేషగిరిరావు(చిన్న), నాయిని రజిని, గొట్టే నాగరాజు, సాదుపాటి రాజు, దువ్వల రామకృష్ణ, కుసుమలత, రామ్ ప్రసాద్ సూర్యదేవర, కుకుట్ల రామలింగం, గింజుపల్లి రమేష్, షేక్ అక్బర్, షేక్ ఉమర్, సయ్యద్ అన్వర్, రాజా, పేరం సైదేశ్వరరావు, గింజుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0