ఎమ్మెల్యే దంపతుల వివాహ వార్షికోత్సవం అన్నదానం ఏర్పాటు చేసిన అభిమానులు
ఎమ్మెల్యే దంపతుల వివాహ వార్షికోత్సవం అన్నదానం ఏర్పాటు చేసిన అభిమానులు
జగ్గయ్యపేట, జనవరి31,( వెలుగు నాడు ప్రతినిధి ) : స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శ్రీదేవి (అమ్మాజీ) దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అభిమానులు జగ్గయ్యపేట పట్టణంలో అన్నదాన మహాకార్యక్రమం నిర్వహించారు.ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద సీబీ ఫాలోవర్స్ బాల టీం ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, కొండయ్య, ఎల్ సీ ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు,పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, జగ్గయ్యపేట మండల సమైక్య అధ్యక్షురాలు నాయిని రజిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న ప్రసాదాన్ని స్వయంగా వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేళి నాగేశ్వరరావు,అక్బర్ ఖాన్, గుమ్మ వెంకటేష్,ఈమని చిట్టి, సురా సతీష్, గుంజ రమేష్, త్రివేణి, దుర్గా భవాని, కొండా, రాధా, రాయపూడి శ్రీకాంత్, చిత్తలూరి శేఖర్, గగులోతు హుస్సేన్, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0