న్యాయవాదుల ఆధ్వర్యంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మాజీ అసిస్టెంట్ ప్లీడర్ మట్ట ప్రసాద్ జన్మదిన వేడుకలు
న్యాయవాదుల ఆధ్వర్యంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మాజీ అసిస్టెంట్ ప్లీడర్ మట్ట ప్రసాద్ జన్మదిన వేడుకలు నందిగామ, జనవరి,20 (వెలుగు నాడు ప్రతినిధి): పట్టణంలో న్యాయవాదులు, ఆధ్వర్యంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మట్ట ప్రసాద్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు న్యాయవృత్తిలో అంకితభావంతో పని చేసిన మట్ట ప్రసాద్ అనేక మంది యువ న్యాయవాదులకు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. సమాజానికి న్యాయం అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నందిగామ న్యాయవాద సంఘ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, అభిమానులు పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0